Free Coaching
Free Coaching| ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ సోమవారం పరిశీలించారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్ఖడే సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కేంద్రాన్ని అధికారులతో కలిసి సందర్శించిన ఎస్పీ.. అభ్యర్థులతో మాట్లాడి శిక్షణ తరగతుల నిర్వహణ, వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ములుగు జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం కావడంతో పేద అభ్యర్థులు ఉద్యోగ శిక్షణ కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లడం ఆర్థికంగా భారంగా మారుతుందని ఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు భోజన వసతులతో కూడిన ఉచిత శిక్షణను అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు.
ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు క్రమశిక్షణతో కష్టపడి చదవాలని ఎస్పీ సూచించారు. ప్రస్తుతం అందిస్తున్న శిక్షణ కేవలం ప్రిలిమ్స్ పరీక్ష వరకే పరిమితం కాదని, మెయిన్స్ పరీక్షల వరకు కొనసాగిస్తామని తెలిపారు. అభ్యర్థులకు చివరి వరకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం ఎస్పీతో పాటు పోలీస్ అధికారులు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ప్రతాప్, ములుగు సీఐ సురేష్, ఆర్ఐ స్వామి, విశ్వ కోచింగ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ విశ్వనాథ్, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
