Jangaon Bathukamma
*రంగప్ప చెరువులో నీళ్లు లేకపోవడంతో నేలపైనే నిమజ్జనం
* అధికారుల తీరుపై విమర్శలు
ఆకేరు న్యూస్, జనగామ : పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు రంగప్ప చెరువు వద్దకు చేరుకున్న మహిళలకు అక్కడ నీళ్లు లేకపోవడంతో నిరాశ ఎదురైంది.
చెరువులో నిమజ్జనానికి సరిపడా నీళ్లు లేకపోవడం, అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక బతుకమ్మలను నేలపైనే ఉంచి నిమజ్జనం చేశారు.
ప్రతి ఏటా ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై మహిళలు అసహనం వ్యక్తం చేశారు. పండుగ సందర్భంగా నిమజ్జనానికి అవసరమైన నీటి సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు.
బతుకమ్మ పండుగకు కూడా నీటి కష్టాలా? నిమజ్జనానికి ఏర్పాట్లు చేయలేరా? అంటూ మహిళలు ప్రశ్నించారు. పండుగల సమయంలోనైనా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

