* టీజర్‌పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశంసలు.
Caste Movie Teaser| ఆకేరు న్యూస్, సినిమా: కాస్ట్ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. దర్శకుడు ఏకే జంపన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. కాశిక కపూర్, దివి వద్యా కథానాయికలుగా నటిస్తున్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్ లాంచ్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని, దర్శకుడు శివ నిర్వాణ తదితరులు హాజరయ్యారు. టీజర్‌ను వీక్షించిన అతిథులు చిత్రబృందాన్ని అభినందించారు.
కుల వివక్ష.. హత్యల నేపథ్యంలో కథ
కుల వ్యవస్థ, వివక్ష చుట్టూ తిరిగే కథాంశంతో ‘కాస్ట్’ టీజర్ ప్రారంభమవుతుంది. అగ్రకులానికి చెందిన వారి ఇంట్లోకి ప్రవేశించడానికి తమకు అనుమతి లేదని ఓ తండ్రి తన కుమారుడికి చెప్పే సన్నివేశం ద్వారా సామాజిక వివక్షను పరిచయం చేశారు. కుల వ్యవస్థను వ్యతిరేకించే పోలీస్ అధికారి పాత్రతో కథలో మరో కోణాన్ని చూపించారు.
వరుణ్ సందేశ్ ఇంటెన్స్ నటన, పోలీస్ అధికారి పాత్రలో గగన్ బాబు పవర్ఫుల్ లుక్ ఆకట్టుకుంటున్నాయి. సత్యం రాజేశ్, యాంకర్ రవి, దివి వద్యా తదితరుల పాత్రలు టీజర్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. వీకే రామరాజు సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి.
సూపర్ డూపర్ హిట్ కావాలి
టీజర్ లాంచ్‌లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నిర్మాత తోట లక్ష్మీ కోటేశ్వరరావు తన తొలి ప్రయత్నంగా మంచి సినిమాను నిర్మిస్తున్నారని ప్రశంసించారు. సమాజంలో కులం పాత్ర ఏమిటి? అంబేద్కర్ కుల వ్యవస్థ గురించి ఏమని ఆలోచించారు? ప్రస్తుత తరం కుల వ్యవస్థను ఎలా చూస్తోంది? వంటి అంశాలను ఆధారంగా చేసుకుని సందేశాత్మకంగా, యాక్షన్ థ్రిల్లర్ శైలిలో చిత్రాన్ని రూపొందించినట్లు నిర్మాత వివరించారని తెలిపారు.
మంచి సందేశం ఉంటుందని ఆశిస్తున్నా
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ‘కాస్ట్’ అనే టైటిల్ ఆసక్తికరంగా ఉందని, చిత్రంలో మంచి సందేశం ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నిర్మాతకు తొలి సినిమా ఎంతో ముఖ్యమైనదని పేర్కొంటూ, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రేక్షకులు సినిమాను థియేటర్లలో వీక్షించాలని కోరారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. కొత్త నిర్మాతలు చిత్ర పరిశ్రమలోకి రావడం వల్ల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు లభిస్తాయని అన్నారు. తోట లక్ష్మీ కోటేశ్వరరావుకు అభినందనలు తెలిపిన ఆయన, ఈ సినిమాతో దర్శకుడు జంపన్నకు మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.
కంటెంట్‌తో పాటు కమర్షియల్ అంశాలు
నిర్మాత తోట లక్ష్మీ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చర్చించుకునేలా సినిమాను రూపొందించామని చెప్పారు. దర్శకుడు జంపన్న చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, అనూప్ రూబెన్స్ మంచి సంగీతాన్ని అందించారని తెలిపారు. త్వరలో పాటలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
హీరో గగన్ బాబు మాట్లాడుతూ.. సామాజిక అంశంతో పాటు కమర్షియల్ హంగులను కలిపి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎన్నో ఉత్కంఠభరిత సన్నివేశాలు ఉంటాయని పేర్కొన్నారు. దర్శకుడు జంపన్నతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపారు.
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. టీజర్లో చూపించింది కథకు చిన్న పరిచయం మాత్రమేనని, సినిమాలో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి నటీనటుడు తమ పాత్రల్లో చక్కగా నటించారని, ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.
‘థియేటర్లో అందరూ సమానమే’
దర్శకుడు ఏకే జంపన్న మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే ప్రదేశం థియేటర్ అని అభిప్రాయపడ్డారు. టికెట్ కొనుగోలు చేసి థియేటర్లోకి వెళ్లిన తర్వాత ప్రతి ఒక్కరూ సమానంగా కూర్చుంటారని, అలాంటి సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, గగన్ బాబు, సత్యం రాజేశ్, రవి అద్భుతంగా నటించారని తెలిపారు.
నటుడు రవి మాట్లాడుతూ.. ఈ సినిమా కథ, దాన్ని నమ్మిన నిర్మాత, తెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు, ప్రేక్షకులు.. ఈ నలుగురూ చిత్రానికి హీరోలని వ్యాఖ్యానించారు. ఈ కథ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సత్యం రాజేశ్, దివి వద్యా కూడా టీజర్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తూ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

