* అర్హులందరికీ పథకాల ఫలాలు అందాలి:
* ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
Padi Kaushik Reddy| ఆకేరు న్యూస్, కమలాపూర్: ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం కమలాపూర్ రైతు వేదికలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం రూ.81,09,396 విలువైన 81 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఏఎంసీ చైర్పర్సన్ ఝాన్సీ, పీఏసీఎస్ చైర్మన్ సంపత్ రావు, ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం కూడా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని విడుదల చేయాలని కోరారు.
అలాగే దళిత బంధు రెండో విడత పథకాన్ని అమలు చేయాలని, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. కమలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, సుమారు 90 శాతం పూర్తయిన బస్‌స్టాండ్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

