Nashkal Drinking Water Problem
* నల్లాల్లో తోకపురుగులు, చెత్తాచెదారం!
* ట్యాంకు శుద్ధికి మెట్లే అడ్డంకి..
* అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో తాగునీటి కష్టాలు (Drinking Water Problem) మొదలయ్యాయి. మిషన్ భగీరథ నీళ్లు మురికిమయంగా మారాయి. నల్లాల్లో వచ్చే నీటిలో తోకపురుగులు, చెత్తాచెదారం వస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మురికి నీరు తాగి దద్దుర్లు, దురద, జ్వరాల బారిన పడుతున్నామని గ్రామస్తులు వాటర్ ట్యాంక్ ముందు నిరసన తెలిపారు.
గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు. మిషన్ భగీరథ ట్యాంకుకు మెట్లు లేకపోవడంతో శుద్ధి (Drinking Water Problem) చేయలేకపోతున్నామని పంచాయతీ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఏఈ, డీఈలకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని సర్పంచ్, చాతబోయిన రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు తన దృష్టికి తేవడంతో ఏఈ, డీఈలను పలుమార్లు కలిశానని తెలిపారు. ట్యాంకుకు మెట్లు లేక శుద్ధి చేయలేకపోతున్నామని అన్నారు. అధికారులు వెంటనే మెట్లు నిర్మిస్తే ట్యాంకు శుద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

