Teja Sajja| ఆకేరు న్యూస్, సినిమా: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధమైన ‘ది ట్రైటర్స్ తెలుగు’ సిరీస్‌పై ఆసక్తి పెంచేందుకు వినూత్న ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మిస్టీరియస్ క్లోక్‌మెన్ సందడి చేస్తూ స్థానికుల దృష్టిని ఆకర్షించారు. సిరీస్ ప్రీమియర్‌కు ముందు నిర్వహించిన ఈ ప్రత్యేక యాక్టివేషన్ షోపై క్యూరియాసిటీని పెంచింది.
మాస్క్‌లు.. మిస్టరీ!
సిగ్నేచర్ క్లోక్స్, మాస్క్‌లతో కనిపించిన క్లోక్‌మెన్ మూడు నగరాల్లోని ప్రముఖ ప్రాంతాల్లో సర్ప్రైజ్ అప్పియరెన్స్‌లు ఇచ్చారు. వారి రహస్యమైన వేషధారణ, ఆకస్మిక ప్రవేశాలు అక్కడి ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ ప్రచారం ద్వారా ‘ది ట్రైటర్స్ తెలుగు’లో ప్రధానంగా కనిపించే మోసం, మైండ్ గేమ్స్, నమ్మకం, ద్రోహం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
నమ్మకమే అసలైన పరీక్ష!
‘ది ట్రైటర్స్ తెలుగు’లో ఎవరిని నమ్మాలి? ఎవరు మోసం చేస్తారు? అనే ఉత్కంఠే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సిటీ యాక్టివేషన్ షోలోని హై-స్టేక్స్ గేమ్‌కు చిన్న పరిచయంలా నిలిచింది. ఇందులో పొత్తులు ఎప్పుడైనా మారవచ్చు.. నమ్మకం ఏ క్షణంలోనైనా పరీక్షకు గురికావచ్చు.. ఊహించని వ్యక్తి నుంచి ద్రోహం ఎదురుకావచ్చు అనే అంశాలను ఈ ప్రచారం హైలైట్ చేసింది.
‘మోసం ఇక్కడ న్యూ రూల్’ అనే ట్యాగ్‌లైన్‌తో సాగిన ఈ ప్రచారం సిరీస్‌పై అంచనాలను మరింత పెంచింది. నగరాల్లో క్లోక్‌మెన్ సందడి చేయడం ద్వారా ప్రేక్షకులను తెరపై ఎదురుచూస్తున్న మిస్టరీ ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్
తేజ సజ్జ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’ను ఎస్ఓఎల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సిరీస్ అక్టోబర్ 15, 2026 నుంచి ప్రత్యేకంగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మొత్తం 10 ఎపిసోడ్లతో రూపొందిన ఈ షో తెలుగు భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులోకి రానుంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్లు విడుదల కానున్నాయి.
మిస్టరీ, వ్యూహాలు, మైండ్ గేమ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైన ‘ది ట్రైటర్స్ తెలుగు’ ఏ స్థాయిలో ఉత్కంఠను పంచుతుందో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

