Kataram Tahsildar Office
* తహసీల్దార్ కార్యాలయంలో పెనుప్రమాదం.. * ఊడిపడిన స్లాబ్ పెచ్చులు!
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి : కాటారం తహసీల్దార్ (Kataram Tahsildar office) కార్యాలయంలో పైకప్పు స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో పెనుప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన అధికారులు, సిబ్బంది తహసీల్దార్ గది తాళం తీసి చూడగా స్లాబ్ నుంచి పెద్ద ఎత్తున పెచ్చులు ఊడిపడి గదిలో చెల్లాచెదురుగా కనిపించాయి.
* విధుల సమయంలో జరిగి ఉంటే భారీ ప్రమాదమే..
ఈ ఘటన రాత్రి సమయంలో కార్యాలయంలో ఎవరూ లేని వేళ జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. విధులు నిర్వహించే సమయంలో స్లాబ్ పెచ్చులు ఊడిపడి ఉంటే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం తప్పడంతో కార్యాలయ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
* తక్షణ మరమ్మతులకు సిబ్బంది విజ్ఞప్తి
పాతబడిన కార్యాలయ భవనాన్ని సంబంధిత అధికారులు పరిశీలించి, ప్రమాదకరంగా మారిన పైకప్పు భాగాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

