Bollu Devender
* బాధ్యతలు స్వీకరించిన నూతన చైర్మన్, 12 మంది డైరెక్టర్లు
* హాజరైన మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: తాడ్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) నూతన చైర్మన్‌గా బొల్లు దేవేందర్ ముదిరాజ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు మరో 12 మంది డైరెక్టర్లు కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. తాడ్వాయిలోని స్థానిక పీఏసీఎస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అధికారుల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం
జిల్లా సహకార సంఘాల అధికారి బి. రామ్మోహన్, సీనియర్ ఇన్స్పెక్టర్ రాజేష్, స్థానిక సీఈవో ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో నూతన చైర్మన్, డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క బొల్లు దేవేందర్ ముదిరాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సహకార సంఘం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని, వారి సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.
రైతుల సంక్షేమానికి కృషి చేస్తా
చైర్మన్ బొల్లు దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పీఏసీఎస్ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
పలువురు ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జాలపు అనంతరెడ్డి, బుర్రి అరుణ, ఆకుల సమ్మయ్య, పిట్టల సాంబయ్య, ఎనగందుల నరసింహారెడ్డి, ఊకే నర్సింగరావు, గుమ్మడి ముత్తయ్య, అలెం సాంబశివరావు, గోసంగి స్వామి, మేడిశెట్టి పుష్పావతి, ఎండీ అక్రమ్ హుస్సేన్, పాక రాజేందర్ పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు మంకిడి నరసింహస్వామి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాల నాగమణి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు, మాజీ సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, మేడారం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అరేం లచ్చు పటేల్, ఇరుప సునీల్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

