Kolluru Prakasham| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కొల్లూరు ప్రకాశం పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఈ నెల 15, 16 తేదీల్లో నల్లగొండ జిల్లా బీఎం గార్డెన్స్లో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్రస్థాయి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల అనంతరం జరిగిన రాష్ట్రస్థాయి ఎన్నికల్లో కొల్లూరు ప్రకాశాన్ని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
కృతజ్ఞతలు
తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డికి, జనగామ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, కార్యదర్శి రాంబాబు, స్టేషన్ ఘన్పూర్ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, కార్యదర్శి రఘుతో పాటు పీఆర్టీయూ కార్యకర్తలకు కొల్లూరు ప్రకాశం కృతజ్ఞతలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

