* కవిత మృతికి కాంగ్రెస్ నేతల నివాళి
Jangaon| ఆకేరు న్యూస్, రాయపర్తి: జనగామ జిల్లా రాయపర్తి మండలం జింకురాం తండా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ గూగులోత్ శ్రీనివాస్–సునీత దంపతుల వదిన గూగులోత్ కవిత అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు జింకురాం తండాను సందర్శించారు. కవిత పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హామ్య నాయక్, వర్ధన్నపేట ఏఎంసీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పెండ్లి మహేందర్ రెడ్డి, దుబ్బ తండా సర్పంచ్ గోపాల్ నాయక్తో పాటు పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొని కవితకు నివాళులర్పించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

