కర్మభూమి ఎక్స్‌ప్రెస్
* నాలుగు బోగీలకు అగ్నిప్రమాదం
* పంజాబ్‌లో రైలు ప్రమాదం
* బోగీల నుంచి దూసుకొచ్చిన మంటలు
ఆకేరు న్యూస్, డెస్క్: కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాటియాలా జిల్లా రాజ్‌పురా సమీపంలోని సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. రైలు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి నాలుగు బోగీలకు వ్యాపించాయి. దీంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అమృత్సర్ నుంచి న్యూ జల్పాయ్గురి వెళ్తున్న 12508 నంబర్ కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ఈ ప్రమాదం జరిగింది. మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు వెంటనే రైలు నుంచి కిందకు దిగారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాల సమాచారం అందలేదు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

