Killer Movie Contest
* దగ్గరగా సమాధానం చెప్పిన 10 మందికి బహుమతులు
* ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందజేత
* త్వరలో ‘కిల్లర్ 2’ కూడా ఉంటుందన్న పూర్వాజ్
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులకు థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించిన చిత్రం ‘కిల్లర్’. ఈ సినిమాకు మేకర్స్ నిర్వహించిన కోటి రూపాయల కాంటెస్ట్‌కు భారీ స్పందన లభించింది. సినిమా సెకండాఫ్ ట్విస్ట్‌ను చెప్పిన వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా విడుదలై విజయవంతమైన నేపథ్యంలో ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన వివరాలను యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్ వెల్లడించారు.
* ప్రేక్షకుల నుంచి మంచి స్పందన
హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. “మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. క్రిటిక్స్ నుంచి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. కొందరు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని కూడా తీసుకున్నాం. ఓవరాల్‌గా మా మూవీకి రెస్పాన్స్, బిజినెస్ పరంగా హ్యాపీగా ఉన్నాం. ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని చేయబోతున్నాం” అన్నారు.
* రూ.2 కోట్ల గ్రాస్ వసూళ్లు
యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ.. “‘కిల్లర్’ సినిమాకు మేము చేసిన ప్రమోషన్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అయినా అనుకోని కారణాల వల్ల మేము ఆశించినంత థియేట్రికల్ రెస్పాన్స్ రాలేదు. రూ.2 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఓటీటీ, ఇతర బిజినెస్ కలిపి రూ.8 కోట్ల వరకు రిటర్న్స్ వచ్చాయి. మా పెట్టుబడి రూ.5 కోట్లు కాగా, రూ.8 కోట్లు రావడంతో బిజినెస్ పరంగా లాభాల్లోనే ఉన్నాం” అన్నారు.
* 5 నిమిషాల సమయాన్ని 30 నిమిషాలకు పెంచాం
“కోటి రూపాయల కాంటెస్ట్ గురించి వివరాలు చెప్పాలనుకుంటున్నాం. సినిమా ఇంటర్వెల్ అయిన ఐదు నిమిషాలకు సెకండాఫ్ ట్విస్ట్‌ను ఒక్క లైన్లో పంపాలని చెప్పాం. అయితే మా సినిమాకు కొన్ని చోట్ల రాత్రి 10, 10.30, 10.45 గంటలకు ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో ఇచ్చిన ఐదు నిమిషాల సమయాన్ని 30 నిమిషాలకు పెంచాం. ఈ సమయంలో తమ సమాధానాలతో సుమారు 5 వేల మంది మాకు స్క్రీన్షాట్లు పంపారు” అని పూర్వాజ్ తెలిపారు.
* దగ్గరగా సమాధానం చెప్పిన 10 మంది ఎంపిక
“వాటిలో మేము అనుకున్న ఆన్సర్‌ను ఎవరూ చెప్పలేకపోయారు. అయినా దగ్గరగా సమాధానం పంపిన 10 మందిని సెలెక్ట్ చేశాం. వారు నాగేంద్ర (హైదరాబాద్), కేశవశర్మ (వైజాగ్), మురళి (హైదరాబాద్), సాగర్ (వైజాగ్), గోపి (హైదరాబాద్), హరి (వైజాగ్), కళ (వైజాగ్), ధృవ్ (హైదరాబాద్), వెంకట్ నాయుడు (హైదరాబాద్), భాను (హైదరాబాద్)” అని చెప్పారు.
“వీరిలో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.10 లక్షల బహుమతి ఇవ్వబోతున్నాం. ఈ విజేతలతో కలిసి లంచ్ చేస్తాం. త్వరలో ‘కిల్లర్ 2’ సినిమా కూడా ఉంటుంది” అని పూర్వాజ్ వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

