Asifabad Collector K Haritha suspended an HM.
* మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన హెచ్ఎం సస్పెండ్
ఆకేరు న్యూస్, ఆసిఫాబాద్ : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ కె.హరిత చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ సస్పెన్షన్ వేటు వేశారు.
తిర్యాణి మండలంలోని పీఎం శ్రీ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంబరం శ్రీనివాస్ మద్యం సేవించి పాఠశాలకు వచ్చినట్లు గుర్తించడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కె.హరిత సోమవారం సంతకం చేశారు.
* మరో హెచ్ఎంపై చర్యలకు కలెక్టర్ ఆదేశాలు..
ఉపాధ్యాయ వృత్తికి తగిన ప్రవర్తన పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇలాంటి చర్యలు విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతాయని అధికారులు పేర్కొన్నారు.సలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవి విధులకు సంబంధించిన సమావేశం ప్రారంభానికి ముందే వెళ్లిపోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు.
సమావేశానికి హాజరై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారి ముందుగానే వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయనపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు.విద్యా శాఖలో పనిచేసే అధికారులు, ఉపాధ్యాయులు విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేసినట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

