జీఎంపీఎస్) జిల్లా అధ్యక్షుడు మోటే దేవేందర్
* జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు మోటే దేవేందర్
Gollakuruma Welfare| ఆకేరు న్యూస్, పాలకుర్తి: గొల్లకురుమల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా అధ్యక్షుడు మోటే దేవేందర్ డిమాండ్ చేశారు. జీఎంపీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో గొల్లకురుమల జీవన పరిస్థితులపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. మండల అధ్యక్షుడు జిట్టబోయిన రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోటే దేవేందర్ పాల్గొని గొర్రెల కాపరులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు.
రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
గొర్రెలను మేపేందుకు అడవులు, గుట్టలు, శివారు ప్రాంతాలకు వెళ్లే కాపరులు పాముకాటు, తేలుకాటు, పిడుగుపాటు వంటి ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్నారని దేవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాల్లో మరణించిన పెంపకందారుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందించి ఆదుకోవాలని కోరారు.
రూ.5 వేల పింఛన్ మంజూరు చేయాలి
నిత్యం గొర్రెల మందల వెంట వందల కిలోమీటర్లు నడవడం వల్ల కాపరులు మోకాళ్ల నొప్పులు, కీళ్ల వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. వృద్ధాప్యంలో ఉపాధి పొందలేని, తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్న గొర్రెల కాపరులకు నెలకు రూ.5 వేల పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలి
పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పశువైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. గొర్రెలకు నల్లబాట, గాలికుంటు, చప్పిడి వాతం వంటి వ్యాధులు సోకకుండా సీజనల్గా ఉచిత టీకాలు వేయడంతో పాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
గొల్లకురుమలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతామని జీఎంపీఎస్ నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బెల్లి లింగన్న, నాయకులు వేల్పుల మల్లయ్య, బెల్లి ఎల్లయ్య, గడ్డి కుమార్, వేల్పుల కొమురయ్య, నిమ్మల మల్లేష్, చిలువేరి అయిలయ్య, బెల్లి సోమనాథ్, బెల్లి అనిల్, జిట్టబోయిన సోమల్లు, రసాల మధు, రసాల దామోదర్, చిలువేరి శ్రీను, జిట్టబోయిన కొమురయ్య, రసాల కుమారస్వామి, వేల్పుల ఎల్లేష్, వేల్పుల రమేష్, చిలువేరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

