లావా గ్రామం
* 21 గిరిజన కుటుంబాలకు తొలిసారి టీవీ
* సోలార్ విద్యుత్‌తో కమ్యూనిటీ టెలివిజన్ ఏర్పాటు
ఆకేరు న్యూస్, దంతెవాడ: ఒకవైపు భారీ ఇనుప ఖనిజ గనులు.. మరోవైపు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోని మారుమూల గిరిజన గ్రామం. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. కిరందూల్ Iron Ore Mining ప్రాంతానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న లావా గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి, సాధారణ విద్యుత్ సౌకర్యాలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్థులకు తొలిసారిగా టెలివిజన్ అందుబాటులోకి వచ్చింది. Solar Powerతో పనిచేసే Community TVని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలోని 21 గిరిజన కుటుంబాలకు వార్తలు, విద్యా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకునే అవకాశం కలిగింది.
21 కుటుంబాలకు ఒకే టీవీ
దంతెవాడ జిల్లాలోని కువాకొండ బ్లాక్ పరిధిలో లావా గ్రామం ఉంది. బైలడిలా కొండలు, దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ గ్రామానికి ఇప్పటికీ పక్కా రహదారి లేదు. విద్యుత్ Grid కనెక్షన్ కూడా అందుబాటులో లేదు. నిత్యావసర సరుకులు, రేషన్ పొందేందుకు గ్రామస్థులు కొండలు, రాళ్లతో కూడిన కఠినమైన మార్గాల్లో కొన్ని కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఉంది.
ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (CREDA), దంతెవాడ జిల్లా యంత్రాంగం సంయుక్తంగా గ్రామంలో Community Television ఏర్పాటు చేశాయి. ఇది వ్యక్తిగత వినియోగం కోసం కాకుండా 21 కుటుంబాల ప్రజలందరూ కలిసి వీక్షించేలా ఏర్పాటు చేశారు.
విద్యా కార్యక్రమాలు
గ్రామస్థులు రోజువారీ పనులు ముగించుకున్న తర్వాత ఒకచోట చేరి టీవీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. ఇందులో National & International Newsతో పాటు ప్రభుత్వ ప్రకటనలు, వ్యవసాయ కార్యక్రమాలు, ఆరోగ్య సమాచారం, విద్యా ప్రసారాలు అందుబాటులో ఉంటాయి.
ముఖ్యంగా గ్రామంలోని పిల్లలకు Educational Programmes, General Knowledgeకు సంబంధించిన కార్యక్రమాలు చూసే అవకాశం కలగనుంది. పెద్దలకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెరగనుంది.
ఈ టీవీ పూర్తిగా Solar Energyతో పనిచేసేలా రూపొందించారు. విద్యుత్ నిల్వ కోసం Battery System కూడా ఏర్పాటు చేయడంతో సాధారణ విద్యుత్ సరఫరా లేకపోయినా టీవీని వినియోగించుకునే అవకాశం ఉంది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో అభివృద్ధి
బైలడిలా కొండల వెనుక ఉన్న లావా గ్రామం గతంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. మారుమూల భౌగోళిక పరిస్థితులు, భద్రతాపరమైన సవాళ్ల కారణంగా ప్రభుత్వ సేవలను గ్రామానికి చేర్చడం అధికారులకు కష్టంగా ఉండేది.
అయితే భద్రతా చర్యలు, ప్రభుత్వ కార్యక్రమాల విస్తరణతో అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రజలకు అవసరమైన సేవలను అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 21 కుటుంబాలకు ఉపయోగపడేలా Community TV ఏర్పాటు చేయడం అభివృద్ధి దిశగా ఒక ముందడుగుగా నిలిచింది.
టీవీ వచ్చింది.. రహదారి ఎప్పుడు?
లావా గ్రామానికి టెలివిజన్ అందుబాటులోకి రావడం సంతోషకరమైన పరిణామమే అయినప్పటికీ, అక్కడి ప్రజల ప్రాథమిక సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. ముఖ్యంగా రహదారి లేకపోవడం వల్ల రేషన్, వైద్యం వంటి అత్యవసర సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాధారణ విద్యుత్ సౌకర్యం కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు.
కేవలం 8 కిలోమీటర్ల దూరంలో భారీ ఇనుప ఖనిజ గనులు ఉన్నప్పటికీ, లావా గ్రామం కనీస మౌలిక సదుపాయాలకు దూరంగా ఉండటం అభివృద్ధిలోని అసమానతలను స్పష్టం చేస్తోంది. సోలార్ టీవీతో గ్రామస్థులకు బయటి ప్రపంచంతో అనుసంధానం ఏర్పడినా.. రహదారులు, విద్యుత్, వైద్యం, విద్య వంటి Basic Infrastructure కూడా అందుబాటులోకి వచ్చినప్పుడే గ్రామానికి సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

