మాట్లాడుతున్న హనుమకొండ జిల్లా విద్యాధికారి వెంకటగిరి రాజు గౌడ్
* డీఈవో వెంకటగిరి రాజు గౌడ్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి అన్ని రంగాల్లో ముందుకు సాగాలని హనుమకొండ జిల్లా విద్యాధికారి వెంకటగిరి రాజు గౌడ్ పిలుపునిచ్చారు. కమలాపూర్ మండలం గూడూరు పరిధిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్-14, అండర్-19 బాలికల క్రీడోత్సవాలు (MJP Girls Sports Meet) మంగళవారం ఘనంగా ముగిశాయి.

ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రోత్సాహంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారని కొనియాడారు. ఉమ్మడి జిల్లాలోని 18 పాఠశాలలు, 7 జూనియర్ కళాశాలలకు చెందిన 700 మందికి పైగా విద్యార్థినులు (Girl Students) కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు పోటీలు హోరాహోరీగా సాగాయి. క్రీడల ద్వారా విద్యార్థినుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, మానసిక వికాసం పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు.

అండర్-19 జూనియర్ కళాశాల విభాగంలో ఎంజేపీ కాజీపేట జూనియర్ కళాశాల (MJP Kazipet Junior College) ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. అండర్-14 విభాగంలో బచ్చన్నపేట ఎంజేపీ బాలికల పాఠశాల ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు, ట్రోఫీలను అందజేశారు.
కార్యక్రమంలో ఏఎంఓ డాక్టర్ మనోహర్, ఎంజేపీ ఓఎస్డీ మనోహర్ రెడ్డి, డీసీఓ స్టెల్లా, ఆతిథ్య పాఠశాల ప్రిన్సిపల్ సౌజన్య, ఎంజేపీ కమలాపూర్ బాలుర పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ తాడూరి రవీందర్, ఎంజేపీ కమలాపూర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కవితా రెడ్డి, ప్రఫుల్ల, ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
Read Also : SRHకు బిగ్ షాక్.. ట్రావిస్ హెడ్ ఔట్!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

