Mulugu Municipality Tax Hike
* ములుగు మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి
* పెంచిన పన్నులను వెంటనే తగ్గించాలి
– బీఆర్ఎస్ ములుగు నియోజక వర్గ ఇంచార్జీ బడే నాగజ్యోతి
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల పెంచిన ఇంటి పన్నులు, వాణిజ్య పన్నులను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ పార్టీ ములుగు మండల మాజీ అధ్యక్షులు సానికొమ్ము రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి హాజరై మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు, వ్యాపారవేత్తలపై ప్రభుత్వం అదనపు పన్నుల భారం మోపడం అన్యాయమని, పెంచిన పన్నులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మునిసిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ.. ములుగు మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న సామాన్య ప్రజలు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరోవైపు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న వ్యాపారవేత్తలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పన్నులు, వాణిజ్య పన్నులను భారీగా పెంచి ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రి సొంత నియోజకవర్గం, సొంత మండలమైన ములుగులో అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులు తీసుకురావాల్సింది పోయి, ప్రజల నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేసి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
మంత్రి ములుగు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయడం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేమీ కాదని,ప్రజల హక్కుల కోసం ఉద్యమించడం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించడం మా పార్టీకి నిత్య కృత్యం అది మా బాధ్యత,ప్రజలపై మోపిన అదనపు పన్నుల భారాన్ని తగ్గించే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పెంచిన పన్నులను వెంటనే తగ్గించకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పోమ నాయక్, జిల్లా నాయకులు వేములపల్లి బిక్షపతి, ఎంపిటిసి ల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్ రామ్ నాయక్, భూక్య జంపన్న,ములుగు కార్పొరేటర్లు బైకాని సునీత ఓదెలు, బైకాని సాగర్, గండ్రకోట వాణి కుమార్,వేణు, లక్ష్మీ , భరత్, యువజన విభాగం అధ్యక్షుడు కోగిల మహేష్, మాజీ ఎంపిటిసి గొర్రె సమ్మయ్య, గరిగె రఘు, పైడిమల్ల భాస్కర్ , సంతోష్, ముంజాల బిక్షపతి, రాణా ప్రతాప్,రవిరామన్ ,సారయ్య, మాజీ ఎంపీటీసీ వంకూడోతు రాందాస్, మోహన్.నవీన్ . గండి కుమార్, ఆకుతోట చంద్రమౌళి, శేఖర్, కార్తీక్, చంటి , రంజిత్, భరత్, సతీష్ , తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.

