Indira Gandhi Jayanti
* తొర్రూరులో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
ఆకేరు న్యూస్, తొర్రూరు: భారత మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి వేడుకలను గురువారం తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మోత్కూరి రవీంద్ర చారి, ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. దేశ సమగ్రత (National Integrity), సార్వభౌమత్వం (Sovereignty) పరిరక్షణతో పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని పేర్కొన్నారు. ఉక్కు మహిళ (Iron Lady)గా పేరుగాంచిన ఇందిరా గాంధీ దార్శనిక నాయకత్వం, పాలనా దక్షత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు చెవిటి సుధాకర్, చిత్తలూరు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర కోశాధికారి జక్కన్న మహబూబ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పింగిలి ఉష, మండల నాయకులు ఎనగందుల శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు కర్ర అశోక్ రెడ్డి, అచ్చిరెడ్డి, పట్టణ యువజన అధ్యక్షులు బసనబోయిన మహేష్, బీసీ సెల్ మండల అధ్యక్షులు వల్లపు యాకన్న, ఎస్టీ సెల్ అధ్యక్షులు అజ్మీర రమేష్ పాల్గొన్నారు.
అలాగే మహమ్మద్ జలీల్, బిజ్జాల అనిల్, తాళ్లపెల్లి బిక్షం, భూసాని రాము, సట్ల నాగలక్ష్మి, జంజీరాల మనోహర్, సిరికొండ భవాని, యశోద, హరిత, భూతం భరత్, పిట్టల చింటూ, మందపురి శ్రీధర్, గంగాధర్ యాకాంబరం, పంజాల అల్లూరు, నరేష్, యర్రం రాజు యాదవ్ తదితర యువజన నాయకులు, మహిళా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

