మృతురాలి కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ
* కుటుంబానికి రూ.15 లక్షల భరోసా
* మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, సిద్దిపేట: సిద్దిపేటలో నిర్వహించిన సభకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో (Siddipet Accident) ప్రమాదానికి గురై హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (55) మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
* మృతురాలి కుటుంబానికి మంత్రి పరామర్శ..
సారవ్వ మృతి విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి వెళ్లి ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ హైమవతితో కలిసి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
* తక్షణ సాయంగా రూ.5 లక్షలు..
బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణ ఆర్థిక సాయంగా రూ.5 లక్షల చెక్కును మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

* ప్రమాద బీమా ద్వారా మరో రూ.10 లక్షలు..
మృతురాలు మహిళా సంఘం సభ్యురాలు కావడంతో సంఘం సభ్యులకు వర్తించే రూ.10 లక్షల ప్రమాద బీమా పరిహారం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. బీమా పరిహారం మంజూరయ్యేలా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. దీంతో బాధిత కుటుంబానికి మొత్తం రూ.15 లక్షల మేర ఆర్థిక భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
* కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
ప్రమాదంలో ((Siddipet Accident) కుటుంబ సభ్యురాలిని కోల్పోయిన బాధిత కుటుంబానికి ఈ కష్ట సమయంలో ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తక్షణ ఆర్థిక సాయంతో పాటు మహిళా సంఘం ప్రమాద బీమా ద్వారా కూడా కుటుంబానికి తోడ్పాటు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Read Also : సిద్దిపేటలో సీఎం ప్రసంగంపై హరీశ్‌రావు ఫైర్..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

