Karthika Pournami
* ఉప్పల్లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
ఆకేరు న్యూస్, కమలాపూర్: కార్తీక పౌర్ణమి (Karthika Pournami) పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను (Satyanarayana Swamy Vratam) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని చిన్న చెరువు మత్తడి సమీపంలో ఉన్న శ్రీ మహా లింగమయ్య దేవస్థానంలో ఈ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.
108 శివలింగాలతో (108 Shiva Lingas) విరాజిల్లుతున్న ఆలయ ప్రాంగణం కార్తీక పౌర్ణమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ దంపతులు, భక్తులు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పూసాల ప్రకాశం మాట్లాడుతూ.. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకున్నారని పేర్కొన్నారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో సందడిగా మారాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

