Perumandla Ramakrishna
* అణగారిన వర్గాల అభ్యున్నతే రాజ్యాంగ లక్ష్యం
* డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
ఆకేరు న్యూస్, హనుమకొండ: పేద, బడుగు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించి, సమాజంలో అందరితో సమానంగా అభివృద్ధి చెందే అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.
భారత రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) సందర్భంగా గురువారం ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ సురేష్ నాయకత్వంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ పీఠిక (Preamble) స్ఫూర్తితో ప్రపంచంలోని అనేక దేశాలు తమ రాజ్యాంగాలను రూపొందించుకున్నాయని పేర్కొన్నారు. అలాంటి గొప్ప చరిత్ర భారత రాజ్యాంగానికి ఉందని కొనియాడారు. నేడు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు గౌరవంగా జీవిస్తూ, స్వేచ్ఛగా తమ హక్కులను అనుభవిస్తున్నారంటే అందుకు రాజ్యాంగం కల్పించిన రక్షణే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలను సహించం
ప్రస్తుతం దేశంలో భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఆరోపించారు. అలాంటి చర్యలను ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే అణగారిన వర్గాల ప్రజలు ఏమాత్రం సహించబోరని హెచ్చరించారు. దేశంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి సహా పాలకులందరూ రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ వ్యవస్థలు పేద, బడుగు, బలహీన వర్గాలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, వారి అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేడల ప్రసాద్, తెలంగాణ మాదిగ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేడ స్వామి, రాష్ట్ర నాయకుడు బొచ్చు మొగిలి, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే, వివిధ ప్రజా సంఘాల నాయకులు మోరే ఐలయ్య, సంజయ్, దామెర ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

