* రతన్ టాటా మాజీ ప్రేయసి ట్వీట్
ఆకేరు న్యూస్ డెస్క్ : దిగ్గజ పారిశ్రామికవేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా(Rathan Tata) కన్నుమూతతో ఎందరో దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన టాటా దేశానికి సేవను అందరూ స్మరించుకుంటున్నారు. ఒక దూర దృష్టి ఉన్న వ్యాపారవేత్త రతన్ టాటా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), రాష్ట్రపతి పలువురు సహా ఎందరో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా, ఆయన మృతిపై టాటా మాజీ ప్రేయసి సైతం ట్వీట్ చేశారు. “ఇక నువ్వు లేవని అంటున్నారు. ఇది భరించలేనిది. వీడ్కోలు నేస్తమా” అంటూ రతన్ టాటాతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సిమి గరెవాల్(Actress Semi Gareval) సంతాపం తెలిపారు. తాను రతన్ టాటాతో డేటింగ్ చేసినట్లు, ఆ తర్వాత ఇద్దరు విడిపోయినట్లు గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సిమి ఓ ఇంగ్లీష్ మూవీ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, తర్వాత బాలీవుడ్, బెంగాలీ వంటి భాషల చిత్రాల్లో నటించి మెప్పించింది.
…………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
