ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జన్వాడ ఫాంహౌస్ కేసులో ఏ2గా ఉన్న రాజ్‌పాకాల(Raj Pakala) ఈరోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. న్యాయవాదితో కలిసి మోకిల పోలీస్ స్టేషన్(Mokila Police Station) కు చేరుకున్నారు. ఈ ఘటన జరిగిన రోజే రాజ్ పాకాల కోసం పోలీసులు ఆయన విల్లాకు వెళ్లారు. ఆయన అందుబాటులో లేరు. ఇంతలో విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల సమయం కావాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గడువు ముగియడంతో ఈరోజు పోలీసుల విచారణకు ఆయన హాజరయ్యారు. అడ్వకేట్ తో కలిసి ఆయన పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ నెల 26న రాజ్ పాకాల తన ఫాంహౌస్(Form House)లో దివాళీ పార్టీ ఇచ్చారు. అయితే ఈ పార్టీకి వచ్చిన వారిలో విజయ్ మద్దూరి(Vijay Madduri)కి మాత్రమే డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్(Drug Possitive) వచ్చింది. రాజ్ పాకాల డ్రగ్స్ ఇస్తేనే తాను తీసుకున్నట్టుగా విజయ్ మద్దూరి పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే తన స్టేట్ మెంట్ లో తాను చెప్పని అంశాలను కూడా చేర్చారని విజయ్ మద్దూరి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ కేసులో విజయ్ మద్దూరిని విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. విజయ్ మద్దూరి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఆయన వాడిన ఫోన్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
