* నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో అధికారుల దాడులు
ఆకేరు న్యూస్, నిర్మల్ : అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు ఓ జూనియర్ అసిస్టెంట్(Jr Assistent) చిక్కారు. లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో (Nirmal Municipal Office) ఏసీబీ(ACB) అధికారులు బుధవారం దాడులు (raids)నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 15 వేలు లంచం తీసుకుంటూ మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ షాకీర్(Shakir) పట్టుపడ్డాడు. బిల్ కలెక్టర్ భరత్ సర్వీస్ బుక్ ఎంట్రీ కోసం లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ముందస్తు సమాచారం మేరకు ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
…………………………………………