* 65 మంది ప్రయాణికులు గల్లంతు
* కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఆకేరు న్యూస్ డెస్క్ : ఉత్తరాఖండ్ విలయం మరువక ముందే తెల్లవారుజామున నేపాల్ (Nepal) లోని మదన్ – అషిర్తా హైవే (Madan – Ashirta Highway) పై భారీగా కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. అదే సమయంలో అటుగా వస్తున్న రెండు బస్సులు (Two Buses) త్రిశూలి నది (Trishuli River) లో పడిపోయాయి. ఆబస్సుల్లో సుమారు 65 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు కొనసాగిస్తోంది. నదిలో గల్లంతైన వారిని రక్షించేందుకు స్థానికులు కూడా అధికార యంత్రాంగానికి సహకరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్థరాత్రి కావడం..చీకటి ఉండటంతో కొండచరియలు పడినట్లు డ్రైవర్లు గుర్తించలేకపోయారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగి పడటంతో రెండు బస్సులు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. నేపాల్లోని చిత్వాన్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇంద్రదేవ్ యాదవ్ (Chitwan Chief District Officer Indradev Yadav)మాట్లాడుతూ.. సంఘటన స్థలంలో ఉన్నామని, సెర్చ్ ఆపరేషన్ (Search Operation) కొనసాగుతోందని మీడియాకు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సహాయచర్యలకు ఇబ్బందికలిగిస్తున్నాయన్నారు.
————————–