* స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన సభ్యులు
* లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లేసిన 64.2 కోట్ల మంది
* జీ7 దేశాల జనాభాకు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఓటర్లు
* ఓటేసిన వారిలో 31 కోట్ల మందికిపైగా మహిళలే
* 27 రాష్ట్రాల్లో ఎక్కడా రీపోలింగ్ అవసరమే రాలేదు..
* చరిత్రాత్మకంగా ఎన్నికలు జరిగాయి..
* రేపు కౌంటింగ్‌కు పక్కా ఏర్పాట్లు చేశాం : సీఈసీ
ఆకేరు న్యూస్ డెస్క్ : అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసి భారత దేశ ఓటర్లు ప్రపంచంలోనే రికార్డు సృష్టించారని సీఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. ప్రధానంగా సీనియర్ సిటిజన్లు, మహిళలు ఓట్లు వేసేందుకు ఉత్సాహం చూపారని వెల్లడించారు. ఓటర్లకు సలాం చెబుతూ సీఈసీ ప్యానెల్ సభ్యులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. రేపు కౌంటింగ్ జరగనుండగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. సీఈసీ కీలక విషయాలను వెల్లడించింది. రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. మనదేశంలో ఓటు వేసిన వారి సంఖ్య జీ7 దేశాల జనాభాకు కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉందని ఆనందం వెలిబుచ్చారు. ఏడు దశల్లో పోలింగ్ విజయవంతంగా ముగిసిందని, 27 రాష్ట్రాల్లో ఎక్కడా రీపోలింగ్ అవసరమే రాలేదని వివరించారు.
ఓటేసిన 64.2 కోట్ల మంది..
2024 లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓట్లు వేశారని, వారిలో 31 కోట్ల మందికిపైగా మహిళలు ఉన్నారని సీఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. ఇంత భారీ సంఖ్యలో ఓట్లు వేయడం ప్రపంచ రికార్డు అని తెలిపారు. సీనియర్ సిటిజన్లకు, మహిళా ఓటర్లకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. జమ్మూ కశ్మీర్లో నాలుగు దశాబ్దాల్లో జరగనంత పోలింగ్ జరిగిందని తెలిపారు. పెద్దగా హింసాత్మక ఘటనలు ఎక్కడా చోటుచేసుకోలేదని సంతోషం వ్యక్తం చేశారు. చరిత్రాత్మక ఎన్నికలుగా ఇవి మిగిలిపోతాయని తెలిపారు.
కౌంటింగ్‌కు పక్కా ఏర్పాట్లు
దేశ్యాప్తంగా రేపే కౌంటింగ్ జరుగుతుందని రాజీవ్ కుమార్ తెలిపారు. ఈమేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల్లో పక్షపాత వైఖరి అవలంబించారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను సీఈసీ ఖండించింది.
—————————-