దొంగల ముఠాను పట్టుకునే ప్రయత్నంలో కాల్పులు.. పోలీసుల..మిస్ఫైర్..
* మిస్ఫైర్ అయిందంటున్న పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) లో శుక్రవారం అర్ధరాత్రి (midnight) కాల్పులు కలకలం సృష్టించాయి. చిలకలగూడ పోలీస్ స్టేషన్ (Chilakalaguda Police Station) పరిధి మెట్టుగూడ (Mettuguda) లో యాంటీ స్నాచింగ్ టీమ్ (Anti Snatching Team Police) సెల్ ఫోన్ దొంగతనాలకు యత్నిస్తున్న ముఠాను పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులను చూసిన ముఠా సభ్యులు పారిపోయేందుకు యత్నించారు. దీంతో యాంటీ స్నాచింగ్ టీమ్ లోని ఓ కానిస్టేబుల్ (Constable) వారిపై కాల్పులు (firing) జరిపాడు. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అయితే.. కావాలని కాల్పులు జరగలేదని, దొంగలకు (thieves), పోలీసు(Police) లకు మధ్య జరిగిన తోపులాటలో మిస్ఫైర్ (Misfire) అయిందని చిలకలగూడ సీఐ (Chilakalaguda CI) వెల్లడించారు. ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. కాల్పులు జరపాల్సిన అవసరంపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.
———————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
