* భారీగా ఆస్తి, ప్రాణ నష్టం
* 40 మంది గల్లంతు
ఆకేరు న్యూస్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో కురుస్తున్న కుంభవృష్టితో అతలాకుతలం అవుతోంది. సిమ్లా, మండి జిల్లా (Shimla, Mandi District) ల్లో పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. రెండు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు (Hydroelectric generating stations) పూర్తిగా ధ్వంసమయ్యాయి. సిమ్లా జిల్లా రాంపూర్ (Shimla District Rampur)ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ (Samej Khad) ప్రాంతంలో క్లౌడ్ బ్లాస్ట్ (Cloud Blast) జరిగింది. భారీ వర్షాలకు ఇప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 40 మందికి పైగా గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టింది. ఎస్డీ ఆర్ ఎఫ్ బృందాలు (SDRF teams) సహాయక చర్యల్లో ఉన్నాయని సిమ్లా డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్ (Shimla Deputy Commissioner Anupam Kashyap) తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో మేఘాలు పేలిన సంఘటనలపై ప్రధాని మోదీ (Prime Minister Modi) పరిస్థితులను అడిగి తెలుసకుంటున్నారు. బాధితులకు సాధ్యమైన అన్ని సహాయాలు అందేలా చూడాలని ప్రధాని మోదీ ఉన్నతాధికారులను కోరారు. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని డ్రాంగ్ అసెంబ్లీలోని చౌహర్ఘటి (Chauharghati in Drang Assembly) లోని తిక్కన్, తేరాంగ్ గ్రామాల (Thikkan and Terang villages) లో మేఘాల విస్ఫోటనం జరిగినట్లు తెలిపారు. ఇక్కడ 11 మంది అదృశ్యమయ్యారు. అదే సమయంలో, ఒక వ్యక్తి కూడా మరణించాడు. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జెపి నడ్డా (JP Nadda) హిమాచల్ సిఎం సుఖ్విందర్ సింగ్ సుఖు (Himachal CM Sukhwinder Singh Sukh) తో మాట్లాడి పరిస్థితి గురించ ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి నడ్డా, మాజీ సిఎం జైరాం ఠాకూర్ (Former CM Jairam Thakur), బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు (BJP state president) తో మాట్లాడిన తరువాత, బిజెపి కార్యకర్తలందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు.
—————