* బీఆర్ ఎస్ లో ఆయన ఉద్యోగి మాత్రమే
* రుణమాఫీ చేస్తే బీఆర్ ఎస్ మూసేస్తారా..
* మనిషి ఎదిగాడు కానీ.. బుర్ర ఎదగలేదు
* రాజీనామాపై కోమటిరెడ్డి కౌంటర్
* బీఆర్ ఎస్ ఓ డ్రామా కంపెనీ : జగ్గారెడ్డి
* హరీశ్ త్వరలో కొత్త పార్టీ పెట్టొచ్చు : రఘునందన్ రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రైతు రుణమాఫీపై సవాల్ చేస్తూ.. రాజీనామా లేఖతో గన్‌పార్క్ కు వచ్చిన మాజీ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా డ్రామాలతో హరీశ్.. జోకర్ గా మారాడాని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘ఆ లేఖ చూస్తే నవ్వొస్తోంది.. హరీశ్.. నవ్వు ఏమైనా బీఆర్ ఎస్ అధ్యక్షుడివా. పార్టీలో అంతా కేసీఆర్, కవిత, సంతోష్ లదే నడిచింది. నువ్వు యజమాని దగ్గర ఉద్యోగివి మాత్రమే. ’’ అని కోమటిరెడ్డి అన్నారు. రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్ లో లేదని, హరీశ్ కు పర్సనాలిటీ పెరిగింది కానీ, బుర్ర పెరగలేదని విమర్శించారు. బీఆర్ ఎస్ చేసిన పాపాల వల్ల 26 లక్షల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోందని తెలిపారు. జూన్ 4 తర్వాత తెలంగాణలో బీఆర్ ఎస్ దుకాణం బంద్ అవుతుందని తెలిపారు.
అందుకే డ్రామాలు
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే హరీశ్ రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. బీఆర్ ఎస్ ఓ డ్రామా కంపెనీ అని ఎద్దేవా చేశారు.
త్వరలో హరీశ్ కొత్త పార్టీ
మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీశ్ త్వరలో కొత్త పార్టీ పెట్టొచ్చని బీజేపీ నేత, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. తాజా రాజకీయాలపై ఆయన స్పందించారు. రాజీనామా పేరుతో కొత్త పార్టీ పెట్టే యోచనలో హరీశ్ ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
———————