* బీసీల పట్ల కాంగ్రెస్ మంత్రుల వివక్ష
* బీసీల రిజర్వేషన్లు చేయకపోతే భూకంపం పుట్టిస్తా..
ఆకేరు న్యూస్, వరంగల్ : కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా నెగ్గిన తీన్మార్ మల్లన్న(MLC Teenmaar Mallanna) ఆ ప్రభుత్వంపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. కుక్కలు, పందులు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం వద్ద లెక్క ఉంది కానీ… బీసీలు ఎంత మంది ఉన్నారో లేవంట అంటూ మండిపడ్డారు. బీసీ ఇంటెలెక్చ్యువల్ ఫోరమ్ (Bc Intelectual Foram)ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal District) సమావేశంలో మల్లన్న మాట్లాడారు. బీసీల పట్ల కాంగ్రెస్ మంత్రులు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. రెడ్డి మంత్రులు(Reddy Ministers) ఎవరు కూడా గెలవకుండా చేసుడు బీసీల లక్ష్యం కావాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించాడానికి కృషి చేస్తానని తెలిపారు. బీసీల రిజర్వేషన్లు (Bc Reservations)అమలుచేయకపోత్తే భూకంపం పుట్టిస్తానన్నారు. తెలంగాణలో బీసీల ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. తన గెలుపులో బీఆర్ఎస్ నేతల కృషి ఉందన్నారు. కుల సంఘాలకు బిచ్చం వేసినట్టు నిధులు కేటాయించుడు పాలకులు మానుకోవాలని హితవుపలికారు. బీసీల ఐక్యతను చూసి పాలకులు ఓర్వలేక పోతున్నారన్నారు. అడుక్కొని తాను టికెట్ తెచ్చుకోలేదు… డిమాండ్ చేసి తెచ్చుకున్నానన్నారు. ‘‘బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎంత… మాపై ఉన్న అప్పులు ఎంతో చెప్పాలని మల్లన్న డిమాండ్ చేశారు.
———————-