Raaka
ఆకేరు న్యూస్, సినిమా: అల్లు అర్జున్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం రాకా(Raaka), ఈ సినిమాపై దర్శకుడు సిబి చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
* అవతార్ తో పోలిక
చెన్నైలో జరిగిన బాత్తా ఆడియో వేడుకలో సిబి చక్రవర్తి మాట్లాడుతూ.. రాకా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. అవతార్ లో కూడా ఇలాంటి విజువల్స్ ఉండవని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అట్లీ తనకు కొన్ని విజువల్స్ చూపించారని, అవి అసాధారణంగా ఉన్నాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 21న అట్లీ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న గ్లింప్స్‌లో ఈ విజువల్స్‌ను ప్రేక్షకులు చూడనున్నట్లు తెలిపారు.
* రాజమౌళితో పోలిక
అట్లీని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కూడా సిబి చక్రవర్తి పోల్చారు. రాజమౌళి భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తున్నట్లే.. అట్లీ కూడా భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తారని అన్నారు. రాకా విజువల్స్‌పై సిబి చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
