సీఎం ను కలిసిన
దక్షిణాఫ్రికా జర్నలిస్టుల బృందం
ఆకేరు న్యూస్ , హైదారాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం దక్షిణాఫ్రికా జర్నలిస్టుల బృందం కలిసింది.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి
సంస్థలో జర్నలిజం మరియు పబ్లిక్ రిలేషన్స్ అనే
అంశంపై అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన
29 మంది దక్షిణాఫ్రికాకు చెందిన
ప్రాతికేయుల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. జర్నలిజంలో
వస్తున్న నూతన పోకడలు, సోషల్ మీడియా సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధత
తదితర అంశాలనుతెలుసుకొనేందుకు, అనుభవాలను
పంచుకొనేందుకు వీలుగా.. ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతోంది.
భారత ప్రభుత్వవిదేశాంగ శాఖ వారి ‘ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్’ (ఐటెక్)
విభాగం సౌజన్యంతో డాక్టర్ ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి. సంస్థలో ఫిబ్రవరి 26 నుంచి
మార్చి 9వ తేదీ వరకు ఈ అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహించబడుతోంది.
అధికారులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి అనంతర శిక్షణ నిమిత్తం హైదరాబాద్
కు విచ్చేసిన అధికారులు , పాత్రికేయులకు శుభాభినందనలు తెలియజేశారు.