* 7 పరీక్ష కేంద్రాలు
* 1231 మంది విద్యార్థులు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
14 నుండి పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ కోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని చిల్పూర్ మండలంలోని మల్కాపూర్ లో ఒక పరీక్ష కేంద్రం స్టేషన్ ఘన్ పూర్ మండలంలో ఆరు పరీక్ష కేంద్రాలు మొత్తం కలుపుకొని ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈఓలు జి.కొమురయ్య, డి. గోవర్ధన్ లు తెలిపారు.
*ఏడు పరీక్షా కేంద్రాలు
స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ రెండు మండలాలలో ఏడు పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ లో జడ్పీ హైస్కూల్ ఇప్పగూడెం, తెలంగాణ మోడల్ స్కూల్, జెడ్పీ శివునిపల్లి హైస్కూల్, జెడ్పి స్టేషన్ ఘన్ పూర్ హై స్కూల్, జడ్పీ హైస్కూల్ చాగల్, హోలీ క్రాస్ హై స్కూల్. చిల్పూర్ మండలంలో జడ్పీ హైస్కూల్ మల్కాపూర్ లో కేంద్రాలు ఏర్పాటు చేశారు.
* 1231 మంది విద్యార్థులు
రేపటినుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు 1231 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రెండు మండలాల్లో కలుపుకొని 24 ప్రభుత్వ పాఠశాలలు 8 ప్రైవేటు పాఠశాలల నుండి 1231 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
*90 మంది సిబ్బంది
పదవ తరగతి పరీక్షల నిర్మాణ కోసం 90 మంది సిబ్బంది నియమించారు. అందులో ఏడుగురు చీఫ్ సూపర్డెంట్లు, ఏడుగురు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 78 మంది ఇన్విజిలేటర్ పదో తరగతి పరీక్షల నిర్వహణలో విధులు నిర్వహించనున్నారు. వీరితోపాటు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా నువ్వు అందించనుంది. ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు మాల్ ప్రాక్టీస్ జరక్కుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు స్థానిక సిఐలు జి. వేణు, ఏ.శ్రీనివాస్ రెడ్డిలు తెలిపారు.
ఈ నెల మార్చి 14,తో పదవ తరగతి పరీక్షలు మొదలు
పరీక్ష సమయం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30వరకు
ముందుగా పదవ తరగతి పరీక్షలు వ్రాయబోతున్న విద్యార్థిని విద్యార్థులకు అల్ ది బెస్ట్ చెబుతూ,జనగాం జిల్లాలో ఘనపూర్ స్టేషన్ మండలం ఉత్తీర్ణతలో మొదటి స్థానంలో నిలపాలని ఆల్గే విద్యార్థిని విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకుంటే ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా ఉండొచ్చు అని, ఎలాంటి మానసిక ఒత్తిడులకు లొంగకుండా పరీక్షలు శ్రద్ధగా వ్రాయాలని MEO కొమురయ్య గారు తెలిపారు.
