సమస్యాత్మక నియోజకవర్గాలు గుర్తింపు..
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నడూలేని రీతిలో ఈసారి వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ ఒకవైపు.. తెలుగుదేశం,బీజేపీ, జనసేన మరోవైపు.. వారిద్దరికీ మధ్యలో కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ కూటమి చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నాయి. ఈక్రమంలో కొన్నిచోట్ల విద్వేషాలు రగులుతున్నాయి. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈనేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అప్రమత్తమైంది. పోలింగ్ వేళ ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తుగా అప్రమత్తమైంది. సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించి.. ఆ ప్రాంతాలకు భద్రతా బలగాలను భారీ ఎత్తున మొహరింపచేయాలని రక్షణ శాఖను కోరింది. ఈమేరకు ఏపీకి భారీ ఎత్తున సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఈసీ సమస్యాత్మక నియోజకవర్గాలుగా ప్రకటించిన 14 ప్రాంతాల్లో నిఘా పెంచాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సమస్యాత్మక నియోజకవర్గాలు ఇవే..
1) మాచర్ల
2) వినుకొండ
3) గురజాల
4) పెదకూరపాడు
5) ఒంగోలు
6) ఆళ్లగడ్డ
7) తిరుపతి
8) చంద్రగిరి
9) విజయవాడ సెంట్రల్
10) పుంగనూరు
11) పలమనేరు
12) పీలేరు
13) రాయచోటి
14) తంబళ్లపల్లె
——————————-