* హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకుని నన్ను వదిలేశాడు..
* రాజ్‌తరుణ్‌పై ఓ యువతి ఫిర్యాదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సినీ హీరో రాజ్‌తరుణ్ (Raj Tharun) తనను ప్రేమించి మోసం చేశాడని ఓ యువతి పో్లీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్, తాను గత 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని లావణ్య (Lavanya) అనే యువతి వెల్లడించింది. రాజ్ తరుణ్ తో పెళ్లి కూడా అయిందని ఫిర్యాదులో పేర్కొంది. హీరోయిన్ తో అఫైర్ కారణంగా తనను వదిలేశాడని లావణ్య వివరించింది. రాజ్ తరుణ్ సోదరుడు కూడా తనను బెదిరించాడంటూ ఆమె ఆరోపించింది. ఈ మేరకు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నటి మాల్వీ మల్హోత్ర (Malvi Malhotra), ఆమె సోదరుడితో తనకు ప్రాణహాని ఉందని తెలిపింది. లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య ఫిర్యాదుపై ఆధారాలు సేకరిస్తున్నట్లు నార్సింగ్ సీఐ తెలిపారు.
ఆమె వేరే అబ్బాయితో రిలేషిన్ షిప్ లో ఉంది : రాజ్ తరుణ్
లావణ్యతో 2014 నుంచి 2017 వరకు రిలేషిన్ షిప్ లో ఉండడం వాస్తవమేనని, ప్రస్తుతం ఆమెతో ఎటువంటి సంబంధమూ లేదని తెలిపారు. డ్రగ్స్, చెడు అలవాట్లకు బానిసై తనను వేధించడంతో వదిలేశానని వివరించారు. ఆమెపై డ్రగ్ కేసు కూడా నమోదైందన్నారు. ఆమెతో పెళ్లి అయిందనేది అవాస్తవమన్నారు. తనకు జీవితంలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదన్నారు. లావణ్య వేరే అబ్బాయితో రిలేషిన్ షిప్ లో ఉందని, అతడు కొట్టి వేధిస్తుండడంతో డబ్బు కోసం ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడుతోందని చెప్పారు. ప్రస్తుతం లావణ్య తన ఇంట్లోనే ఉంటోందని, తానే బయటకు వచ్చేశానని వెల్లడించారు. ఇంట్లో నుంచి వెళ్లగొడతాననే భయంతో ఇదంతా చేస్తోందని ఆరోపించారు. ఆమె చానాళ్లుగా తనను బెదిరిస్తుందని, సెలబ్రిటీగా గౌరవం కాపాడుకునేందుకు భయపడుతూ వచ్చానని అన్నారు. అయితే, తనను కొందరు కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని, వాస్తవానికి ఆ డ్రగ్స్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని లావణ్య తాజా ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.