* ప్రధానిపైనా ఒత్తిడి పెరుగుతోంది..
* ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ది లేదు
* ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి కదా
* సుప్రీం తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ
* మీడియాతో ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana Cm Revanthreddy) అన్నారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించామన్నారు. కేబినెట్ భేటీ, శాసనసభలో కీలక బిల్లుల ప్రవేశం నేపథ్యంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. కులగణన విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)పై కూడా ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచే ఇస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెళ్తామని వెల్లడించారు. అలాగే, మంత్రివర్గ ఉపసంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ముందుకెళ్తామన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ది లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి కదా అని ప్రశ్నించారు. ఈ డాక్యుమెంట్ పై కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 88 జనరల్ సీట్లలో 30 బీసీలకు ఇచ్చామని, సభలో పెట్టే డాక్యుమెంట్ ఎప్పుడైనా రిఫరెన్స్ గా ఉంటుందన్నారు. 56 శాతం బీసీలు, 17.5 శాతం ఎస్సీల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.
……………………………………….