
– మొదటి విడతగా 30లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉప్పల్ లో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : హన్మకొండ జిల్లా కమలాపుర్ మండల అభివృద్ధికై ఎంపీ లాడ్స్ కింద 1.17 కోట్ల నిధులు మంజూరు కాగా మొదటి విడతగా ఉప్పల్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులు 30లక్షలతో 350 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ…. కేంద్ర మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కమలాపూర్ మండల అభివృద్ధికై 1.17 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షనీయం అన్నారు. మండల ప్రజల తరపున ప్రధాని మోది, బండి సంజయ్ కుమార్ కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల అభివృద్దితో దేశాభివృద్ధి సాధ్యమనే సంకల్పంతోనే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సుస్థిరమైన పాలన అందిస్తున్నదని అన్నారు. ఉప్పల్ అభివృద్ది విషయంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కల్సిరావడం చాల సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో బిజేపి సీనియర్ నాయకులు తోట సురేష్ ,బండారి సుధాకర్, చెట్టి సుందరయ్య, మెడిపెళ్లి రాజు, బండి సంపత్,బండారి సుధాకర్, శ్రీనివాస్,లచ్చన్న,పిట్టల సతీష్, బిఆర్ఎస్ నాయకులు మారేపెళ్లి నవీన్ ,ఎర్రబెల్లి దేవేందర్ రావు,ర్యాకం మొండయ్య, ఎర్రబెల్లి సంపత్ రావు,రాజమౌళి,తదితరులు పాల్గొన్నారు.
పేద విద్యార్థిని ఉన్నత చదువులకు చేయూత
– లాప్టాప్ ను అందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
కమలాపూర్ మండలంలోని భీంపల్లి గ్రామానికి చెందిన ఎలుగం భార్గవి బాసర త్రిబుల్ ఐటీ లో మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసి, గేట్ పరీక్షకు సన్నద్ధం అవుతుంది. ఈనెల రెండవ తేదీన గేట్ పరీక్ష రాయాల్సి ఉండగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరగడంతో, పరీక్ష రాయలేక ఇంటి వద్దే ఉండి చికిత్స తీసుకుంటుంది. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ భార్గవి ఉన్నత చదువులకు ఆటంకం కలగకుండా , ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవటానికి Hp లాప్టాప్ ను అందించారు. ఈ సందర్భంగా భార్గవి తల్లిదండ్రులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, మండల నాయకులు భూపతి ప్రవీణ్, భీంపల్లి బూత్ అధ్యక్షులు వాసాల సత్తయ్య, సులుగూరి శ్రీనివాస్, కుర్మిండ్ల సంతోష్, ఎగ్గొజు శ్రీనివాస్, ఆకినపెల్లి రవీందర్, చింతల రంజిత్, ఎలుగం సారయ్య పాల్గొన్నారు.
……………………………………….