November 6, 2024

ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశంలో చేరిన వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే

ఆకేరు న్యూస్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ మారే నేతల సంఖ్య పెరుగుతోంది ..తాజాగా వైయస్సార్ పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీలతో పాటు సర్పంచ్ లు ఇతర నేతలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు.

నా అన్న‌కు ఓటు వేయొద్దు..

నా అన్న‌కు ఓటు వేయొద్దు.. ఈ ఎన్నిక‌ల్లో న్యాయాన్ని గెలిపించండి.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వైఎస్సార్ సీపీ పార్టీపై మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏర్పాటు చేసినప్రెస్ మీట్ లో ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించాయి. ఈసారి వైసీపీని గెలిపించొద్దని ఓట‌ర్ల‌ను కోరారు. ఈ ఎన్నికల్లో తనకు ప్రజల సహకారం కావాలని.. ప్రజలు ఓటు ద్వారా స‌రైన‌ తీర్పు ఇవ్వాలని కోరారు. ఇక్కడ రాజకీయం కోసం కాదని, న్యాయం కోసం తీర్పు ఇవాల‌ని పిలుపునిచ్చారు. త‌న అన్న‌ జగన్‌కు ఓటు వేయవ‌ద్ద‌ని, రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఉండొద్ద‌ని తెలిపారు. హత్యలు చేసేవారు రాజకీయాల్లో, ప్రభుత్వాల్లో ఉండొద్ద‌ని, వారికి పాలించే హ‌క్కు లేద‌ని అన్నారు. మరోసారి తన అన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తే తన తండ్రి హత్య కేసుకు న్యాయం జరగదని చెప్పారు. వంచన చేసిన, మోసం చేసిన వైసీపీకి ఓటు వేయొద్దు అని సునీతారెడ్డి కోరారు. తండ్రి హ‌త్య‌ కేసులో తాను చేస్తున్న పోరాటంలో తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎంపీ రఘురామకృష్ణ రాజుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఈ కేసులో నిందితులు వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను రక్షించేందుకు య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. ట్రయల్ జరిగితేనే హంతకు లకు శిక్ష పడుతుందని.. అవినాశ్, భాస్కర్ రెడ్డిలు తప్పు చేయకపోతేనిర్దోషులుగావిడుదల చేయాలని , తప్పు చేస్తే వారిని శిక్షించాలన్నారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం
లేదని ఆమె ప్రశ్నించారు. వీళ్లను రక్షించే పనిలో జగన్ ఉన్నారని ఆరోపించారు. సాధారణంగా హత్య కేసు 4, 5 రోజుల్లో తేలుతుంద‌ని, కానీ ఈ కేసు దర్యాప్తు మాత్రం ఐదేళ్లుగా కొనసాగుతోందన్నారు. త‌న‌కు ప్రజాకోర్టులో తీర్పు కావాలని సునీతారెడ్డి అన్నారు . జగన్ కేసుల వల్లే నాన్న హత్య కేసును సాగదీస్తున్నారని అన్నారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో త‌న‌కు తెలియద‌ని, షర్మిల ఒక్కరే త‌న‌కు మొదటి నుంచి అండగా నిలిచారని సునీత తెలిపారు..