* వామపక్ష ఐక్యత దేశానికి అవసరం
* సిపిఐ పార్టీ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
ఆకేరు న్యూస్, కరీంనగర్ : భారత గడ్డమీద సిపిఐ పార్టీకి 100 ఏళ్ళు అయ్యాయని సిపిఐ పార్టీ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈనెల 15వ తేదీన కొమురం భీం జిల్లా జోడేఘాట్ నుండి ప్రారంభమైనటువంటి జాతా ఈరోజు సైదాపూర్ మండలం కు చేరుకుంది. ఈ జాతను భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి లంకదాసరి కళ్యాణ్ ఆధ్వర్యంలో జాత నాయకులు చాడ వెంకటరెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే, సీపీఐ పార్టీ సీనియర్ నాయకులు, తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కలవిన శంకర్ సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మారుపాక అనిల్ కుమార్ డిహెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పల్లెనరసింహ తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ జాతకు ప్రతినిత్యం వహించగా వారికి సిపిఐ పార్టీ మండల సమితి ఆధ్వర్యంలో పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం సైదాపూర్ బస్టాండ్ చౌరస్తాలో సిపిఐ పార్టీ జెండాను చాడ వెంకటరెడ్డి ఆవిష్కరించిన అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులు నిత్య ప్రదర్శన చేయగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. భారత గడ్డపై సిపిఐ పార్టీకి వందేళ్ళ పోరాటాల చరిత్ర కలదని ఆయన అన్నారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని తొలిత గర్జించిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని అదేవిధంగా భూమి కోసం భుక్తి కోసం భారతదేశ విముక్తి కోసం మిలిటెంట్ ఉద్యమాలు నడిపినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆయన కొనియాడారు. కార్మిక విద్యార్థి యువజన రైతు మహిళా తదితర ప్రజా సంఘాల నిర్మించి వెట్టి చాకిరి విముక్తి కొరకు పోరాడినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆయన అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో దేశంలో కమ్యూనిస్టు పార్టీలు మరింత బలపడాలని వామపక్ష ప్రజాతంత్ర పురోగామి శక్తులు ఏకం కావాలని కావాలని చెప్పి ఆయన అన్నారు. బిజెపి పార్టీ 2014 ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రగడ్బాలు పలికిన బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేయలేదని అంతేకాకుండా దేశంలో బిజెపి పార్టీ ప్రజల మధ్య మత విశ్వాసాలు రెచ్చగొడుతూ వరుసగా అధికారం నిలబెట్టుకున్నారు అని చెప్పి ఆయన అన్నారు. దేశ సంపదను ఆదాని అంబానీ కార్పొరేట్ శక్తులకు అంటగడుతున్నదని సంపన్నులు మరింత సంపన్నులు అవుతుంటే పేదలు మరింత పేదలుగా అవుతున్నారని ఆయన విమర్శించారు. ఈరోజు దేశంలో కమ్యూనిస్టుల ఐక్యత వామపక్షాల ప్రజాతంత్ర శక్తుల ఐక్యత గురించి సిపిఐ నిరంతరం కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. కమ్యూనిస్టు పార్టీ జాతీయ అంతర్జాతీయ నాయకులకు ఖమ్మం నగరంగా ఘనంగా ఆతిథ్యం ఇవ్వనుందని ఆయన అన్నారు. ఈ 100 ఏళ్ల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ఉత్సవాల్లో వచ్చే నెల డిసెంబర్ 26న తేదీన అధిక సంఖ్యలో ప్రజలు మేధావులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొన్నగంటి కేదారి. ప్రచార జాత నాయకులు రెహమాన్, కన్నం లక్ష్మీనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు కోయడ సృజన్ కుమార్ నేలపట్ల రాజు పైడిపల్లి రాజు మహిళా సమైక్య నాయకురాలు గూడెం లక్ష్మి, హుస్నాబాద్ నియోజవర్గ పార్టీ కన్వీనర్ జాగిరి సత్యనారాయణ . కోఆర్డినేటర్ కనుకుంట్ల శంకర్. గడిపే మల్లేష్. సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి జడల రాజేశం కార్యవర్గ సభ్యులు నలువాల రవి, భాషవేణి శ్రీనివాస్, భాషవేణి సురేష్, తోటి మహేష్ పాల్గొన్నారు.
……………………………………………
