
* ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
* వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా విషాదం
ఆకేరు న్యూస్, డెస్క్ : ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. చౌతియా ఛత్తీ నుంచి రాయ్‌పూర్‌కు వస్తుండగా జరిగిన రోడ్దు ప్రమాదంలో ఈ దారుణం జరిగింది. ప్రమాదంలో 30 మందికిపైగా గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. రాయ్‌పూర్ (Raiipur) – బలోద బజార్ (Balod Bazar) దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వస్తున్న ప్యాసింజర్ వాహనాన్ని అతి వేగంగా వస్తున్న ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలు, నలుగురు చిన్నారులు మృతి చెందారు. ప్రమాదంలో 30 మంది గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించినట్లు రాయ్‌పుర్ ఎస్పీ (Raypur Sp)లాల్ ఉమ్మెద్ సింగ్ వెల్లడించారు. వివాహ వేడుకకు వెళ్లి చౌతియా ఛత్తీ నుంచి రాయ్‌పూర్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయ్‌పుర్ ఎస్పీ లాల్ ఉమ్మెద్ సింగ్ తెలిపారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
…………………………………………………..