* శ్రీవారి హుండీ ఆదాయం వెల్లడించిన టీటీడీ
ఆకేరు న్యూస్, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానానికి(TIRUMALA TIRUPATHI DEVASTHANAM) చెందిన గత ఏడాది నివేదికను అధికారులు గురువారం ఉదయం విడుదల చేశారు. 2024లో శ్రీవారికి కేవలం హుండీ ద్వారానే 1360 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. వెంకటేశ్వరస్వామి(VENKATESWARA SWAMY)ని 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. మొత్తంగా 99 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. ఆరు కోట్ల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 12.14 కోట్ల లడ్డూలను కొనుగోలు చేశారు.
…………………………………………….