
* రాజంపేట జైలుకు తరలింపు
ఆకేరున్యూస్, అమరావతి: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా కోర్టులోని రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా.. అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్లో నమోదైన కేసులో పోలీసులు పోసానీని బుధవారం రాత్రి హైదరాబాద్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఓబులవారిపల్లె తరలించి గురువారం రాత్రి 9.30 గంటలకు రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వాదలు.. శుక్రవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగాయి. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా బీఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. దానికి నిరాకరించిన కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేసిన సందర్భంగా పోసాని కృష్ణ మురళిని రాజంపేట జైలుకు తరలించారు.
…………………………………