
ఆకేరు న్యూస్ ములుగు : వచ్చే ఏడాది జనవరిలో జరుగనున్న మేడారం సమ్మక్క జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనిధులతో మహా జాతర నిర్వహణ, మేడారం లో శాశ్వత నిర్మాణాలు మౌలిక వసతులు కల్పించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం మహా జాతర ను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.
………………………………………….