
ఆకేరు న్యూస్ డెస్క్: మహబూబాబాద్ కు చెందిన భూక్యా నాయక్ చెందిన కారులో నుంచి 16 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే మహాబూబాబాద్ కు చెందిన భూక్యానాయక్ ఒడిషా నుంచి మహారాష్ట్రకు కారులో గంజాయి తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద కారు ప్రమాదానికి గురైంది కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు ప్రమాదానికి గురైన కారులో 16 కేజీల గంజాయి లభించింది.దీంతో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకొని భూక్యానాయక్ ను అదుపులోకి తీసుకున్నారు.
……………………………………………..