![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/download-41.jpg)
* కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు
* ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించే అవకాశం
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఈ నెల 19న భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరుగనున్నది. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. త్వరలోనే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుక జరుగనుండగా.. విస్తృత స్థాయి కార్యవర్గాన్ని సమావేశపరచాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు భేటీ నిర్వాహణకు సంబంధించి పార్టీ కార్యవర్గ నిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ భేటీలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, నిర్మాణాత్మక అంశాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలలపై చర్చించడంతో పాటు వాటిని ఎండగట్టేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి.. ప్రజలను చైతన్యం చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ, ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్ ఛైర్మన్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు.. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిలు హాజరవుతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలవిూద ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణపై సమగ్ర చర్చ జరగనుంది. ప్రభుత్వం ఇచ్చిన హావిూలను సాధించుకుంటూ, తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం అనుసరించాల్సిన వ్యూహాలు విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కీలక సమావేశం కాబట్టి ఆహ్వానితులందరూ రావాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
……………………………………