
* వినియోగదారులకు అందుబాటులో 24గంటల సేవలు
* ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఆకేరున్యూస్, ములుగు: విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తినా 1912 టోల్ ఫ్రీనంబర్ కు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్, 24గంటలు వినియోగదారులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని ఆయన తెలిపారు. విద్యుత్ సరఫరాలో తలెత్తే ఇబ్బందులైన ట్రాన్స్ఫార్మర్ల ఫేయిల్యూర్లు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ , లోవోల్టేజి , బ్రేక్ డౌన్స్, , ప్రమాదభరింతగా ఉన్న స్థంబాలు, వైర్లు తదితర సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలన్నారు. విద్యుత్ బిల్లుల సమస్యలైన వినియోగదారుడి పేరు మార్పు, బిల్లులలో తేడాలు, బిల్లులో ఏమైనా హెచ్చుతగ్గులు, ఆగిపోయిన మీటర్లు, పోయిన మీటర్లు. నూతన సర్వీసు మంజూరు, సర్వీస్ క్యాన్సలేషన్ లాంటి అన్ని రకాల విద్యుత్ సేవలో ఉన్న సమస్యలు టోల్ ఫ్రీ నంబర్ 1912 సంప్రదించి సేవలు పొందగలరని కోరారు. ప్రతి ఒక్క వినియోగదారుడు గుర్తు పెట్టుకునేలా టోల్ ఫ్రీ నంబర్ 1912 ను విస్తృతంగా ప్రచారం చేపడుతున్నామని చెప్పారు. అలాగే రైతులకు అవగాహన కల్పించడం కొరకు ఈ నంబర్ ను ప్రతి ట్రాన్స్ఫార్మర్ల పై ముద్రించామని తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదులు సత్వర పరిష్కారం కావడానికి టోల్ ఫ్రీ నంబర్లు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. వినియోగదారుల అభిప్రాయం కూడా తీసుకోబడుతుందని అన్నారు. ముఖ్యమైన కార్యాలయాలకి నిరంతర విద్యుత్ సరఫరాకి తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ అదికారులని నిర్దేశించడం జరిగిందని ఆయన తెలిపారు.
………………………………………..