
ఆకేరున్యూస్: బీహార్ రాష్ట్రంలో వర్ష బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, వడగళ్ల వానలు రాష్ట్రంలోని పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. వర్షం కారణంగా అనేక చోట్ల పిడుగులు పడడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. బెగుసరాయ్, దర్భంగా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, మధుబనిలో నలుగురు, ఔరంగాబాద్, సమస్తిపూర్, సహర్సా నుంచి ఇద్దరు చొప్పున, ఔరియ్యలో ఒక్కరు.. మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ విచారం వ్యక్తం చేసి బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. అలాగే మృతుల ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షలు ఇస్తామని ప్రకటించారు.
……………………………