ఆకేరు న్యూస్, డెస్క్ : ఒడిశాలో మరో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మల్కాన్ గిరి జిల్లాలో ఆ రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయారు. తమ వద్ద ఉన్న 14 ల్యాండ్‌మైన్ లను కూడా మావోయిస్టులు పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిపై 2.18 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను డీజీపీ వై బి. ఖురానియా వెల్లడిస్తారని పేర్కొన్నారు. కలాహండి, కంధమాల్, బలంగీర్, మల్కాన్‌గిరి, కోరాపుట్, నబరంగ్‌పూర్, నౌపడా, రాయగడ, బౌధ్ జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉంది. అయితే ఒడిశాలోని కోరాపుట్, మల్కాన్‌గిరి, కలహండి, నబరంగ్‌పూర్, నౌపడా, బలంగీర్ జిల్లాలు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్నాయి. ఈ ఆరు జిల్లాల్లో మావోయిస్టుల ప్రాభవం అధికంగా ఉంది. ఈక్రమంలో ఇక ఈ రోజు లొంగిపోయిన మావోయిస్టులంతా ఏసీఎం, డీసీఎంలే ఉన్నారని వివరించారు. వీరిపై రూ. 5.5 లక్షల నుంచి రూ. 27.5 లక్షల వరకు రివార్డు ఉందన్నారు. రాష్ట్రంలో మావోయిస్టులు లొంగిపోతే.. పొరుగునున్న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అందిస్తున్న రివార్డు కంటే 10 శాతం అధికంగా నగదు అందిస్తామని ఒడిశాలోని మోహన్ దాస్ మాంజీ ప్రభుత్వం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
……………………………………………..

