* 230 మంది ప్రయాణికులు.. 12 మంది సిబ్బంది
* మృతుల్లో 12 మంది పిల్లలు అందులో ఇద్దరు శిశువులు
* మాజీ సీఎం విజయ్ రుపానీ మృతి
* మాంసం ముద్దలుగా మారిన శరీరాలు
* గుర్తుపట్టడానికి వీలు లేని వైనం
* ప్రమాదంలో పట్టణ వాసులు మృతి
* క్యాంటీన్ లో లంచ్ చేస్తున్న 20 మంది యువ డాక్టర్లు మృతి
* శిధిలాల కింద చిక్కిన నగరవాసులు
ఆకేరు న్యూస్ డెస్క్ : గుజరాత్లో జరిగిన ఘోర విమానప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది మరణించినట్లు గుజరాత్ సీపీ జ్ఞానేంద్ర ప్రకటించారు.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏఐ 171 బోయింగ్ విమానం జానావాసాలపై ఒక్కసారిగా కుప్పకూలింది. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. ప్రయాణికుల్లో భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. ప్రయాణికుల తో పాటు విమానం బిల్డింగులపై పడడంతో బిల్డింగ్ లో నివసించే వారు కూడా మృత్యు వాత పడ్డారు. ఎంత మంది మంది పట్టణవాసులు చనిపోయారనేది ఇంకా అధికారికంగా వెలువడలేదు..ఇక ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు ఉండగా మిగతా వారు విదేశీయులుగా చెప్తున్నారు.ఇక స్థానికుల విషయానికి వస్తే ఎంతమంది మరణించారో ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ పరామర్శించారు.బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంపై బ్రిటన్ ప్రధానితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి,ప్రధాని హోంమంత్రి,పౌరవిమానయాన శాఖ మంత్రితో పాటు ప్రతిపక్షనేతలు తీవ్ర దిగ్భాం్రతి వెలిబుచ్చారు.
……………………………………………………
