
* ఎక్స్ లో పలు పోస్టులు
ఆకేరు న్యూస్, డెస్క్ : 2013లో, 2014 లోక్‌సభ ఎన్నికలకు ప్రధానమంత్రి అభ్యర్థిగా నాకు బాధ్యత అప్పగించారు. ఆ రోజుల్లో, దేశం పాలనా సంక్షోభాన్ని చూస్తోంది. అప్పటి యూపీఏ ప్రభుత్వం అవినీతి, ఆశ్రిత పక్షపాతం, విధాన పక్షపాతానికి పర్యాయపదంగా ఉంది. ప్రపంచ క్రమంలో భారతదేశం బలహీనంగా మారింది. ఆటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజలు మా కూటమికి అఖండమైన మెజారిటీని ఇచ్చారు. మా పార్టీకి 3 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా సంపూర్ణ మెజారిటీ లభించేలా చేశారు.. అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తన అనుభవాలను పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఓ ప్రభుత్వానికి అధినేత హోదాలో ఆయన 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. అక్టోబర్ 7, 2025 నాటికి తన పరిపాలన 25 ఏళ్లకు చేరుకున్నట్లు ప్రధాని మోదీ తన ఎక్స్ (X) అకౌంట్లో పేర్కొన్నారు. ఇదే రోజున 2001లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. దేశ ప్రజల జీవితాలను బలోపేతం చేసేందుకు, దేశ ఉజ్వల ప్రగతి కోసం ఆ నాటి నుంచి శ్రమిస్తున్నట్లు చెప్పారు. చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్న గుజరాత్(Gujarath)కు తనను సీఎంగా చేశారని, ఆ బాధ్యతలను తనకు పార్టీ అప్పగించినట్లు గుర్తు చేశారు. భారీ భూకంపం, సూపర్ సైక్లోన్, వరుస కరవులతో సతమతం అవుతున్న గుజరాత్‌ను తన చేతుల్లో పెట్టారన్నారు. ఇక 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధానిగా దేశానికి సేవ చేస్తున్నట్లు మోదీ తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు.
……………………………………..